భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంతోష్ కుమార్ ను ఎంపీడీఓ ఆఫీస్ స్టాఫ్ సోమవారం ఘనంగా సన్మానించారు. రాష్ట్ర గజిటెడ్ ఆఫీసర్ల సంఘం ప్రచార కార్యదర్శి గా ఎన్నికైన శుభ సందర్బంగా ఆయన కు పూలమాల, శాలువ తో సత్కారించి సన్మానించారు. సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జావీద అలీ, ఏపీఓ నర్సయ్య, ఏపీఎం రవీందర్, సీసీ లు శ్రీనివాస్, నరేష్, రఘుపతి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
