సిద్దిపేట, బతుకమ్మ : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో భారస అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ ముగిసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న నిర్వహించబోయే కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. సుమారు గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. సమావేశం అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ కవిత అంశాన్ని బయట మాట్లాడవద్దని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. త్వరలోనే కవితతో కూడా కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం.
