31 C
Hyderabad

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని ఎంతో సంబరాలతో గురువారం రోజున బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణానంద, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి, తాళ్ల రాంపూర్ సొసైటీ చైర్మన్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు,గడ్డం రమేష్, కొలిపాక శ్రీనివాస్,మండల పరిధిలోని గ్రామ మాజీ బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, మాజీ బిఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article