23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

కేటీఆర్ మహిళా సమాజానికి క్షేమాపణ చెప్పాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి

బతుకమ్మ, భీంగల్ : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర మహిళా సమాజానికి బేషరత్ గా క్షేమాపణలు చెప్పాలని భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బొదిరే స్వామి డిమాండ్ చేశారు. కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సుమంగళి చౌరస్తా వద్ద కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ కు తన తండ్రి నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నిస్తూ ఆయన మహిళపై చేసిన వ్యాఖ్యాలను ఖండించారు.

KTR should apologize to the women community ఆడవాళ్లు అంటే గౌరవం ఉన్నవారు ఈవిధంగా ఎవరు మాట్లాడరని, ఈ వ్యాఖ్యలు మహిళను అవమానపర్చడమే అవుతుందన్నారు. మహిళలకు ఆర్ధిక భారం తగ్గించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తే చూసి ఓర్వలేని కేటీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమం లో పట్టణ పార్టీ ప్రెసిడెంట్ జె. జె. నర్సయ్య, జిల్లా సెక్రటరీ కుంట రమేష్, ఎస్టీ సెల్ మండల ప్రెసిడెంట్ గోపాల్ నాయక్, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దేశాయి కల్పన, యువజన కాంగ్రెస్ కానస్టెన్సీ నాయకులు నాగేంద్రబాబు ,మండల నాయకులు భోజగౌడ్,వాక మహేష్, చరణ్, మహేష్, సాయిలు బొర్రన్న, జూభేర్, ఖలీం, నవీద్, మీరాజ్, నగేష్, గంగాధర్, నారాయణ, రాజేశ్వర్, రాజేశ్, మాలవత్ రమేష్, లింబాద్రి, సేవాలాల్, సాయిలు, నర్సయ్య, వంశీ, దినేష్, రవి, సురేష్, ధనుష్, సాగర్, దిశాన్, రాములు తదితరులు పాల్గొన్నారు.

KTR should apologize to the women community

More articles

Latest article