నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో గల మై చోటా స్కూలు లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గీత మాట్లాడుతూ విద్యార్థిని,విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాల గురించి తెలిసేలా చేశామని అన్నారు. అందరూ విద్యార్థులు వేషధారణలో అబ్బుర పరిచారని, దీనికి తల్లిదండ్రులు కూడా పాఠశాల యాజమాన్యానికి సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు స్పందన, ప్రణీత పాల్గొన్నారు.
