మద్నూర్, బతుకమ్మ: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరస్ వార్ సాయిలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మీర్జాపూర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, హనుమాన్లు, కుశాల్, తదితరులు ఉన్నారు.
