కొంగర రోహిత్ ఆదర్శలు ఆచరనీయం

0 1,715

 నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :     

మాధవ నగర్ కు చెందిన కొంగర శ్రీనివాస్, నీరజల పెద్ద కుమారుడు కొంగర రోహిత్ మొదటి వర్ధంతి సందర్భంగా మాధవ నగర్ మండల ప్రజాపరిషత్  ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోటు పుస్తకాలు, పెన్నులు పెన్నీల్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్, సీఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ లు మాట్లాడుతూ  కొంగర రోహిత్ రోడ్డు ప్రమాదానికి గురై చక్రాల కుర్చీకే పరిమితం కాకుండా ఉన్నత విద్య చదివాడన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ లు చెప్పాడన్నారు. గత సంవత్సరం అనారోగ్యానికి గురై  చనిపోయినా తన కళ్ళను వాసన్ ఐ కేర్ కు,  శరీరాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఇవ్వడం అత్యంత ఆదర్శనీయమన్నారు. కొంగర రోహిత్ భౌతికంగా మరణించినా తన కళ్ళు, శరీరం ఇతరులకు ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రధమ వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తక సామాగ్రి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

Leave A Reply

Your email address will not be published.