27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

స్వతంత్ర  సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపుజీ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : స్వతంత్ర  సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చేనేత సహకార సంఘం అధ్యక్షులు మోత్కూరి నారాయణ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలను రుద్రూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో పద్మశాలి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం బాపూజీ కుటుంబం అనేక త్యాగాలు చేశారని కొనియాడారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన మహానీయుడని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ దేశానికే ఆస్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం డైరెక్టర్ నూత్ పల్లి గణేష్, పద్మశాలి సంఘం సభ్యులు జువ్వల పోతన్న, తాటి పాముల విజయ్, గట్టు సాయిలు, గంగాధర్, ఈర్వ నాగరాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article