
ఎల్లారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం కొలువుదీరింది. శుక్రవారం ఎల్లారెడ్డిలోని రఘుపతి గార్డెన్ లో నూతన కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, విశిష్ట అతిథిగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ హాజరయ్యారు. చైర్ పర్సన్ మారెడ్డి రజితావెంకట్ రెడ్డితోపాటు పాలకవర్గ సభ్యులతో డీఎండీవో రమ్యశ్రీ ప్రమాణం చేయించారు.
