27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఖాళీ అవుతున్న కోనరావుపేట మండల బిఆర్ఎస్ పార్టీ

Must read

📰 Generate e-Paper Clip

  • రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ
  • కోనరావుపేట మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ,మాజీ ఫ్యాక్స్ చైర్మన్ అబ్బాసాని శంకర్ గౌడ్, మరిమడ్ల తాజా మాజీ సర్పంచ్ మాట్ల అశోక్,బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
  • కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ,మాజీ సర్పంచ్,ఫ్యాక్స్ డైరెక్టర్ తదితరులు
  • కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ మాజీ ఛైర్మన్, మాజీ ఎంపీపీ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బాసాని శంకర్ గౌడ్,మర్రిమడ్ల తాజా మాజీ సర్పంచ్ మాట్ల అశోక్,కొలనూరు ఫ్యాక్స్ డైరెక్టర్ ఇప్ప రాములు, మాజీ వార్డు సభ్యులు శంకరవ్వ, బొడ్డు కిషన్ సుమారు 20 మంది శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Konaraopet Mandal BRS Party is vacating

కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు.బిఆర్ఎస్ పార్టీలో దొరల పాలనలో తమకు సరైన గుర్తింపు లేదని, బీసీ బిడ్డ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  ఆధ్వర్యంలో పనిచేస్తామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని వారు తెలిపారు.

Konaraopet Mandal BRS Party is vacating

More articles

Latest article