30.9 C
Hyderabad
Monday, August 3, 2026

 రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అర్చక విభాగం అధ్యక్షుడి గా కొడకండ్ల రామగిరి శర్మ 

Must read

📰 Generate e-Paper Clip

 

 భిక్కనూరు, బతుకమ్మ :

తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ అనుబంధం) అర్చక విభాగం అధ్యక్షుడి గా కొడకండ్ల రామగిరి శర్మ ను నియమిస్తూ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ వెన్నం పల్లి జగన్మోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వరంగల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకొని నియామక ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. నూతనంగా నియమింపబడిన రామగిరి శర్మ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య లో వివిధ హోదాల్లో పనిచేసి , సంఘ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సమస్యలు,వారి సాదకబాదకాలను ప్రభుత్వo దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రoలో బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణాలకు కృషి చేస్తానని తెలిపారు. అర్చక విభాగం రాష్ట్ర కన్వీనర్ గా నియామకానికి సహకరించిన రాష్ట్ర సంఘం అధ్యక్షులు మోత్కూరి రాము, ప్రధాన కార్యదర్శి వైద్య ప్రభాకర శర్మ, కోశాధికారి సముద్రాల విజయసారథి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article