33.2 C
Hyderabad

మంజిరా పరివాహక ప్రాంతంలో కత్తులు దూసిన  పందేం కోళ్లు

Must read

📰 Generate e-Paper Clip

. . . జోరుగా చేతులు మారిన లక్షల రూపాయలు

. . . లోకల్ పోలీసుల మేనేజ్ తో పందేల నిర్వాహణ

నిజామాబాద్ క్రైం,  బతుకమ్మ

మంజిరా పరివాహక ప్రాంతంలో కోడి పందాలు జోరుగా సాగాయి. ఆంధ్రా సెటిలర్లు ఉన్న ప్రాంతంలోని వారు బోగి  పండుగను మొదలుకుని కనుమ వరకు కోడి  పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.  పోలీసు శాఖ ఎన్ని హెచ్చరికలు చేసినా అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించినా కోళ్ళ పందాలు మాత్రం ఆగలేదు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండలాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి  పందాలు జోరుగా జరిగాయి. పోతంగల్, మంజీరా శివారు ప్రాంతాలోని హంగర్గా శివారు, పలుచోట్ల కొంత మంది కోడిపందాలు నిర్వహించారు.  ఈ కోడిపందాల ఆటల నిర్వహణలో అధికార పార్టీ నాయకులతో పాటు పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులు అండదండలతో జోరుగా కొనసాగినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి, వారి అండదండలతో కోడిపందాలు జోరుగా నిర్వహించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఈ విషయం బయటికి పొక్కడంతో జిల్లా ఇంచార్జి సీపీ నిఘా వర్గాలతో విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

More articles

Latest article