31.2 C
Hyderabad

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కిసాన్ మోర్చా నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కిసాన్ మోర్చా నాయకులు నూతన శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని వెంటది వెంట తూకాలు వేసి రైస్ మిల్లులకు తరలించాలని గత 20రోజులుగా అధికారులను కోరుతున్నామన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారని, వెంటనే ధాన్యాన్ని తరలించాలని వేడుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం గురించి పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించకపోవడం సిగ్గు చేటన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, కిసాన్ మోర్చా నాయకులు చిట్టి భజన, శ్రీనివాస్, మల్లయ్య, రైతులు పాల్గొన్నారు.

Kisan Morcha leaders inspect the soaked paddy

More articles

Latest article