- మాజీ జర్నలిస్ట్ కంకణాల రాజేశ్వర్ ఆవేదన
నిజామాబాద్, బతుకమ్మ : చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన ఎన్డీటీవీ రిపోర్టర్, పరిశోధక జర్నలిస్ట్, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ముకేశ్ చంద్రకర్ జర్నలిస్ట్ గా తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ అవినీతిని వెలికి తీసినందుకు సంబంధిత కాంట్రాక్టర్ దారుణ హత్య చేయడం అమానుషమని మాజీ జర్నలిస్ట్ కంకణాల రాజేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఇది హేహమైన చర్యగా ఆయన తీవ్రంగా ఖండించారు.ఆవేదన వ్యక్తం చేశారు. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలోని గంగలూరు-హిరోలి రోడ్డు ప్రాజెక్టులో జరిగిన అవినీతిని జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ బయటపెట్టగా,ప్రాజెక్టు టెండర్ విలువ ప్రారంభంలో 50 కోట్లు కాగా, ప్రాజెక్టు డిజైన్ లో ఎలాంటి మార్పులు లేకుండా ప్రాజెక్ట్ వ్యయాన్ని 120 కోట్లకు పెంచినట్లు జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ ప్రజల దృష్టికి తీసుకు వచ్చారని అన్నారు. దాంతో ముఖేష్ హత్యకు గురి అయినట్లు తెలిపారు.మృతదేహం బాగా ఉబ్బిపోయిన స్థితిలో చట్టన్ పర లోని కాంట్రాక్టర్ సురేష్ కు చెందిన ఇంటి ప్రాంగణంలో కనిపించడం అత్యంత హేయమైందన్నారు.ఇలాంటి దుర్ఘటనల వలన జర్నలిస్ట్ లు భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని,తద్వారా అభద్రత భావానికి లోనవుతారని కంకణాల రాజేశ్వర్ వాపోయారు.ఇలాంటి చర్యకు ఒడిగట్టిన నిందితులు ఎంతటివారైనా వారిని కఠినంగా శిక్షించాలని, మృతుడు ముకేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.
