బాలుడి ని ఎత్తుకెళ్లిన ముగ్గురు మహిళలు
సీఐఎస్ఎఫ్, లోకల్ పోలీసుల భద్రతా వైఫల్యం
ఏడాదిలో రెండో కిడ్నాప్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో తండ్రితో పాటు నిద్రిస్తున్న ఎడాది వయస్సు ఉన్న బాలుడు అపహరణకు గురయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామానికి చెందిన లక్ష్మి అనారోగ్యంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం కోసం చెరింది. భార్యతో పాటు భర్త రాజు తన కోడుకు మణికంఠతో కలిసి ఆసుపత్రిలో నిధ్రించారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు మణికంఠను ఎత్తుకేళ్లారు.శనివారం ఉదయం లెచి చూసే సరికి తన కోడుకు పక్కన లేకపోవడంతో రాజు తనయుడి కిడ్నాప్ వ్యవహరం వెలుగు చూసింది. సంబందిత విడియో పుటేజీ సీసీ టివి కేమోరాలో నిక్షిప్తమైంది. సిఐఎస్ఎప్ బలగాలు, స్థానిక పోలిస్ లు కాపాల ఉండగా బాలుడి కిడ్నాప్ వ్యవహరం కలకలం రేపింది. ఈ ఎడాది ఇది రెండవ బాలుడి కిడ్నాప్. జిల్లా అసుపత్రిలో రక్షణ వ్యవస్థ అంతా ఉత్తిదే అని తెలిపోయింది. చేతులు కాలినంకా అకులు పట్టుకున్నట్లు పోలిస్ లు మాత్రం ఆసుపత్రిలో ఓవారాక్షన్ చేయడం విశేషం. స్థానిక ఓకటవటౌన్ పోలిస్ లు విచారణ చెపట్టారు.