27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటిన కేజీబీవి విద్యార్ధినీలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినీలు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో  100% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ శ్యామల పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు 43 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 43 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. కాగా 43 మంది విద్యార్థినిల్లో 18 మంది విద్యార్థినిలు 500 పైగా మార్కులు సాధించారు. ఎం. శశిక – 555 మార్కులు, జి.భావిక – 551 మార్కులు సాధించి పాఠశాల టాపర్ లుగా నిలిచారు. దీంతో విద్యార్థినిల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయుని బృందం విద్యార్థినీలను అభినందించారు.

More articles

Latest article