29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కాల్పుల కేసు ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లోని  చాదర్‌ఘాట్ విక్టోరియా గ్రౌండ్ లో డీసీపీ సాయి చైతన్య పై  దొంగలు శనివారం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల కేసు ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులకు  డీసీపీ ఫిర్యాదు చేశారు.  డీసీపీ సాయి చైతన్య తెలిపిన వివరాలు. కోటి వద్ద ఓ వ్యక్తి మొబైల్ స్నాచింగ్ చేసి ఆటోలో పారిపోయేందుకు నిందితులు యత్నించారు.  ఆటోలో మొత్తం ముగ్గురు ఉన్నారు.  ఒమర్ ను పట్టుకునేందుకు  గన్ మెన్ మూర్తి ప్రయత్నించాడు.  మిగతా ఇద్దరూ ఆటోలో పారిపోయారు. ఒమర్ నెట్టడంతో మేం కిందపడిపోయాం. గన్ మెన్ ను కత్తితో పొడిచి చంపేందుకు ఒమర్ ప్రయత్నించారు.  దీంతో గన్ మెన్ ను కాపాడేందుకు కాల్పులు జరిపాను అని  పేర్కొన్నారు.

 

More articles

Latest article