వరంగల్, బతుకమ్మ : ప్రేమ విఫలమై యువకుడు సెల్ఫీ సూసైడ్ చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెెళ్తే.. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం ధర్మ తండాలో మహేష్(21) అనే యువకుడు తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ప్రేమించిన యువతితో పెళ్లి జరగదని తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
