వెబ్ న్యూస్, బతుకమ్మ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బుధవారం ఈపిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు అందాయి. అలాగే అసెంబ్లీ సెక్రెటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు , పార్టీమారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈపిటిషన్ పై తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు అందుకున్న వారు ఈనెల 25లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని బీఆర్ ఎస్ పార్టీ జనవరి 15 ను సుప్రీం కోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం
