బతుకమ్మ, భిక్కనూరు: ప్రజలు తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెడికల్ అధికారి యేమిమా తెలిపారు. శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాలలో ఆశ వర్కర్లు ఇంటి పరిసరాలను పరిశీలిస్తూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి పారబోశారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు రాకుండా దోమల నివారణ కొరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, హెచ్ ఇ వో వెంకటరమణ, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్స్, తదితరులు ఉన్నారు.
