27 C
Hyderabad

అమ్మానాన్నల జ్ఞాపకార్థం వంటశాల నిర్మాణం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం పాలెం గ్రామ నికి చెందిన సుంకం లక్ష్మణ్ మనోహర్ లు వారి తల్లిదండ్రులు సుంకం రాములు, ఆండాళమ్మ జ్ఞాపకార్ధంగా పాలెం ఎంపీ యుపిఎస్ పాఠశాలలో వంటశాలను నిర్మించారు. శుక్రవారం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్  జగదీశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించారు. వంటశాల నిర్మించినందుకు సుంకం లక్ష్మణ్ మనోహర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలరాణి, ఏ ఏ ఎం సి పద్మ, వీడీసీ సభ్యులు మహిపాల్, గంగారెడ్డి, సి ఆర్ పి పరిమళ, ఉపాధ్యాయులు పద్మావతి, శ్రీలత, హరిక, విలాస్, లతా, సాగరిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article