- ఎంపీ ధర్మపురి అరవింద్
హైదరాబాద్, బతుకమ్మ : కల్వకుంట్ల కవిత రాష్ట్రం అంతా తిరిగినా 400ఓట్లు కూడా రావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా జిల్లాల పర్యటన సందర్భంగా కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కౌంటర్ వేశారు. ఒక ప్రైవేట్ మీడియా చానల్ తో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేదో ఫాంహౌజ్ కు వెళ్లి కేసీఆర్ ను అడగాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు తీసుకువచ్చి అమరవీరుల కుటుంబాలకు ఇచ్చి న్యాయం చేయాలన్నారు. నాలుగేళ్లు కాదు కదా నాలుగు జన్మలెత్తినా ప్రజలు కవితకు ఓట్లు వేయరని అన్నారు. కేసీఆర్ ఫొటో లేకుండా కవితను ఎవరూ పట్టించుకోరని, ఆయన ఫొటోతోనే కవిత తన జీవితంలో ఒకసారి ఎంపీ అయ్యారని తెలిపారు. జూబ్లీ హిల్స్ లో బీజేపీ పరిస్థతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డిన అడగాలని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతోందో చెప్పగలను కానీ జూబ్లీ హిల్స్ పై తానెట్లా చెప్పగలనని అన్నారు.
