కవితకు 400ఓట్లు కూడా రావు
ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్, బతుకమ్మ : కల్వకుంట్ల కవిత రాష్ట్రం అంతా తిరిగినా 400ఓట్లు కూడా రావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా జిల్లాల పర్యటన సందర్భంగా కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కౌంటర్ వేశారు. ఒక ప్రైవేట్ మీడియా చానల్ తో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేదో ఫాంహౌజ్ కు వెళ్లి కేసీఆర్ ను అడగాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు తీసుకువచ్చి...