27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కామారెడ్డిలో కవిత అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కామారెడ్డిలో చేపట్టిన రైల్ రోకో లో పోలీసులకు,  జాగృతి కార్యకర్తలకు తోపులాట జరిగింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం రైలో రోకోలో భాగంగా కవిత పట్టాలపై బైఠాయించి ఆందోళన చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగి కవిత చేతికి స్వల్ప గాయమైంది. దీంతో కవితను పోలీసు వాహనంలో అక్కడినుంచి తరలించారు. అంతకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి అని కాంగ్రెస్ అని మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డి జిల్లాకు ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని విమర్శించారు. ప్యాకేజీ 21, 22 ద్వారా డబ్బులన్నీ కాంట్రాక్టర్ కే పోయాయన్నారు. ఈవిషయం చెబితే బీఆర్ఎస్ వాళ్లు వాళ్లు తన మీద నోరు వేసుకొని పడిపోతారని విమర్శించారు.

More articles

Latest article