కామారెడ్డిలో కవిత అరెస్టు

కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కామారెడ్డిలో చేపట్టిన రైల్ రోకో లో పోలీసులకు,  జాగృతి కార్యకర్తలకు తోపులాట జరిగింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం రైలో రోకోలో భాగంగా కవిత పట్టాలపై బైఠాయించి ఆందోళన చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగి కవిత చేతికి స్వల్ప గాయమైంది. దీంతో కవితను పోలీసు వాహనంలో అక్కడినుంచి తరలించారు. అంతకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో...