నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డిని ఎంపిక చేసింది. సంగారెడ్డికి చెందిన అంజిరెడ్డికి అవకాశం కల్పించినట్లు రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి నరోత్తమ్ రెడ్డి(వరంగల్)ని ఎంపిక చేశారు. అదే విధంగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్యను (పెద్దపల్లి)ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
