బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వరదరాజు పల్లి, గోవర్ధనగిరి,ఘనపూర్, బండారుపల్లి,చందాపూర్ గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి ఐకెపి ఎపిఎం శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. రాజకీయాలకతీతంగా అందరు కలిసి రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు.అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో రైతులకు సహకరించాలని సూచించారు.మండల కేంద్రంలో దాదాపుగా 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మినహా మిగతా కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సామాగ్రిని అధికారులతో కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుందని కొనుగోళ్ల విషయంలో ఎలాంటి జాప్యం చేయరాదని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి చిట్టచివరి గింజ రైస్ మిల్లులకు చేరేవరకు అధికారులు ప్రజాప్రతినిధులు రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి,మండల వ్యవసాయ అధికారి మోహన్,మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి,వైస్ చైర్మన్ కురుమ యాదగిరి,సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,మాజీ రైతుబంధు అధ్యక్షుడు బోధనం కనకయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందిరామిరెడ్డి,మాజీ ఎంపీటీసీ శరత్ నాయకులు నీల రాజయ్య,మల్లేశం,సుభాష్ గౌడ్,పరమేశ్వర్ రెడ్డి,రాజిరెడ్డి,కమలాకర్,రాంబాబు, రాజశేఖర్,శ్రీకాంత్,మరియు ఏఈఒ లు ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.