. . . బీజేపీ కి చెక్ పెట్టేందుకు ఎక్కమైన కాంగ్రెస్ బిఆర్ఎస్
కామారెడ్డి, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికల లో అధికారం కోసం కొత్త పొత్తు మొలిచింది. ఉద్యమ కాలం నాటి చిరకాల మిత్రులయినా బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. బీజేపీ కి చెక్ పేట్టెందుకు కామారెడ్డి బల్దియాలో కలిసి నడువాలని నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల లలో రెండు పార్టీ లు ఒక్కటి అయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీ లో 49 డివిజన్ లు ఉండగా కాంగ్రెస్ కు 19, బీజేపీ 16,11 బిఅరేయస్ కు రాగా ముగ్గురు స్వతంత్రులు కౌన్సిలర్ లుగా గెలిచినా విషయం తెలిసిందే. అధికార పీఠం కోసం మెజారిటీ రాకపోవడం తో పొత్తులు అనివార్య మాయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఉమారాణి కి ఛైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ గా బి ఆర్ ఎస్ కు చెందిన కాసార్ల గోదావరి ని ఎంపిక చేసినట్టు తెలిసింది. అధికార మార్పిడి ఫై స్పష్టత రాలేదు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక లంచానమే కానుంది.
