కోర్ట్ ఆర్డర్  అమలు చేయని కామారెడ్డి జిల్లా సర్వేయర్

0 1,462
  • పట్టించుకోని జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తాసిల్దార్
  • 2016 సంవత్సరం నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు
  • కోర్టు తీర్పు వచ్చిన సమస్య పరిష్కారం కాలే
  • 70 సంవత్సరాల వృద్ధుడు ఇప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నంలోనే ఉన్నాడు
  • న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటా అన్నారపు వెంకటరెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అన్నారపు వెంకట్ రెడ్డి 70 సంవత్సరాలు గల వృద్ధుడు తన భూమిని అక్రమంగా ఇతరులు కబ్జా చేశారు. దానిని సాధించుకునేందుకు 2016 సంవత్సరం నుండి మండల తాసిల్దార్, డివిజన్ ఆర్డిఓ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారాడు. అతను 2018 సంవత్సరంలో తన సర్వే నెంబరు 406 భూమిలో నుండి జయరామ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి రెండు ఎకరాల 30 గుంటలను కబ్జా చేశాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ కామారెడ్డి కోర్టును ఆశ్రయించాడు. 2019లో స్పందించిన కోర్టు జెయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ పూర్తి చేసి హద్దులు నిర్ణయించారు. అట్టి హద్దులను తిరిగి జయరామ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తొలగించడంతో తాను తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ వద్దకు తిరిగిన ఫలితం లేక తిరిగి 2019 సంవత్సరంలో హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం అన్నారపు వెంకట్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చి ప్రత్యక్షంగా రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి, కామారెడ్డి జిల్లా కలెక్టర్కు, కామారెడ్డి ఆర్ డి ఓ కు, కామారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ సర్వేయర్ కు, కామారెడ్డి తాసిల్దార్ కు, తదితరులకు పంపిస్తూ కామారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ అయిన దేవునిపల్లి ఎస్సై కి దీంతోపాటు కబ్జా చేసిన బానోతు జయరాములకు నోటీసులను జారీ చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు తనకు తన భూమిలో హద్దులు చూపించడం లేదని ఆయన గత కొద్ది రోజులుగా జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, కామారెడ్డి తాసిల్దార్ కార్యాలయల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

  • నన్ను భయభ్రాంతులకు  గురి చేశారు.

తన భూమిని తనకు ఇప్పించాలని వివిధ అధికారుల చుట్టూ తిరుగుతున్న సమయంలో తన భూమిని కబ్జా చేసిన బానోత్ జయరాం అనుచరులు తనను భయభ్రాంతులకు గురి చేశారని. తన రక్షణ కోసం పిస్తోల్ ఇవ్వవలసిందిగా సైతం కామారెడ్డి జిల్లా ఎస్పీకి అర్జీ పెట్టుకున్నట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినా బానోత్ జయరాం కు తన పక్కనే ఉన్న స్థలం జమానులైన లాబిశెట్టి రమేష్ కుమార్, కొక్కొండ శ్రీనివాస్, బి రాజు, బి చిన్న నరసయ్య, పి లక్ష్మి, కే మురళి యాదవ్, గరిగె మల్ల గౌడ్, గరిగ యాద గౌడ్ అనే వీరు వారి భూమిని ఇతనికి వెంచర్  నిమిత్తం విక్రయించారు. సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారి పనిలో పనిగా తన భూమిని కూడా కబ్జా చేశాడు. అతని భూదాహానికి నన్ను బలి చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా కామారెడ్డి తహశీల్దార్ స్పందించి తనకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు.

Leave A Reply

Your email address will not be published.