27.5 C
Hyderabad
Friday, July 31, 2026

కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పాదయాత్రగా..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 25న ఉదయం మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్ కు చేరుకోనున్న నాయకులు

 

సిరిసిల్ల, బతుకమ్మ :

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 25న రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆమె అభిమానులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. తెలంగాణ జాగృతి నాయకులు వినయ్, సతీశ్ ఆధ్వర్యంలో వంద మంది నాయకులు మంగళవారం ఉదయం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

 

Kalvakuntla Kavitha's party formation meeting was a march from Sircilla.

 

మంగళవారం రాత్రికి వీరి యాత్ర సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేరుకుంటుంది. సిద్దిపేటలో రాత్రి బస చేసి బుధవారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తారు. శనివారం ఉదయం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మునీరాబాద్ లో గల అద్వయ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకొని పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొంటారు.

 

Kalvakuntla Kavitha's party formation meeting was a march from Sircilla.

More articles

Latest article