- గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వంకు మూడోసారి లేఖ
హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వంకు మూడోసారి లేఖ రాసింది. ఎన్ని సార్లు లేఖ రాయాలంటూ రేవంత్ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ మండిపడింది. కేసీఆర్‌ను దోషిగా నిరూపించాలి అనుకుంటే కాళేశ్వరం కమిషన్ బూమరాంగ్ అయ్యేలా వ్యవహారం ఉంది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే కమిషన్ రెండుసార్లు లేఖ రాసింది. కేసీఆర్ స్టేట్‌మెంట్ తర్వాత మూడోసారి ప్రభుత్వంకు కమిషన్ లేఖ రాసింది. ఇంజనీర్లు ఓపెన్ కోర్టు స్టేట్‌మెంట్ తర్వాత ఓసారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి కమిషన్ లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదు. కమిషన్‌కు మినిట్స్ ఇవ్వాలా, వద్దా అని సర్కార్కేబినెట్‌లో చర్చించనుంది.
