- తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వస్తున్న కీలక విషయాలు
హైదరాబాద్, బతుకమ్మ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు సమాచారం. అత్యంత గోప్యంగా షర్మిల మొబైల్స్ ట్యాప్ చేసినట్లు తెలిసింది. షర్మిల కోసం కోడ్ భాష ఉపయోగించినట్లు తెలిసింది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు.. ఎవరెవరితో మాట్లాడుతుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు జగన్ కు చేరవేసినట్లు సమాచారం. షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచారు. షర్మిల దగ్గరి మనుషులను పిలిపించినా ఓ సీనియర్ పోలీస్ అధికారి! ఆ పోలీస్ అధికారి ద్వారా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే షర్మిల గుర్తించినట్లు తెలిసింది. తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్లు తెలిసింది.
