29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీ విఠళేశ్వర స్వామి ఆలయంలో కాకడ హారతి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : కార్తీకమాసం ఏకాదశిని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠళేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కాకడ హారతి, స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 5 గంటల నుండె భక్తులు ఆలయానికి చేరుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు, మంగళ హరతులు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చీదుర వీరేశం, కార్యదర్శి గెంటిల సాయిలు మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాల నుండి ఆలయంలో కార్తీకమాసం సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా కోటగిరి గ్రామం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామి వారికీ కాకడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కులకర్ణి నారాయణ శర్మ, రాము శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article