శ్రీ విఠళేశ్వర స్వామి ఆలయంలో కాకడ హారతి

రుద్రూర్, బతుకమ్మ : కార్తీకమాసం ఏకాదశిని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠళేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కాకడ హారతి, స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 5 గంటల నుండె భక్తులు ఆలయానికి చేరుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు, మంగళ హరతులు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చీదుర వీరేశం, కార్యదర్శి గెంటిల సాయిలు మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాల నుండి ఆలయంలో కార్తీకమాసం సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు...