25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

జ్యోతిబాపూలే గొప్ప సాంస్కృతిక విప్లవకారుడు

Must read

📰 Generate e-Paper Clip

  • వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : జ్యోతిబాపూలే  గొప్ప సాంస్కృతిక విప్లవకారుడని తెయూ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో  సంఘసంస్కర్త సాంస్కృతిక విప్లవకారుడు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి  నిరంతరం కృషి చేసిన జ్యోతి రావు ఫూలే జయంతి ఉత్సవాలను  ఘనంగా నిర్వహించాలని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు పేర్కొన్నారు.  వైస్ ఛాన్స్లర్ ఛాంబర్ లో జ్యోతిరావు పూలే జయంతి  ఉత్సవాలను పురస్కరించుకొని  తెలంగాణ యూనివర్సిటీలో భారత జాతీయ అభివృద్ధి అనే అంశంపై ఈనెల 11వ తేదీన  నిర్వహించే  ఒకరోజు సెమినార్  బ్రోచర్ను వైస్ ఛాన్స్ల ర్   ఆచార్య  టీ. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి,  ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, యు జి సి  సెల్ డైరెక్టర్  ఆచార్య సిహెచ్ ఆంజనేయులు, బీసీ సెల్ డైరెక్టర్ ఆచార్య సిహెచ్ ఆరతి, కంట్రోలర్ ఆచార్య సంపత్ రెడ్డిలు  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా వైస్ – ఛాన్స్లర్  మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అట్టడుగు వర్గాలకు విద్య ద్వారానే  జ్ఞానం వర్ధిల్లుతుందని  అనేక పాఠశాలలను స్థాపించి  తన భార్యకు చదువు చెప్పించి  ఉపాధ్యాయురాలుగా మలిచిన మహోన్నతమైన వ్యక్తిని తెలియజేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో కీలక ఉపన్యాసం చేయడానికి  రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ మాదట సీతారామమూర్తి,రిసోర్స్ పర్సన్స్ గా  ఆచార్య సిహెచ్ ఆంజనేయులు, డాక్టర్ ఏ పున్నయ్య, డాక్టర్ ఏ నీలిమ, డాక్టర్ ఎన్ స్వప్నలు పాల్గొంటారని పేర్కొన్నారు.

More articles

Latest article