28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వడ్డెర విద్యార్థులకు న్యాయం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కృష్ణయ్యను కలిసిన జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్

 

బాన్సువాడ, బతుకమ్మ :  బీసీల కొరకు గత 40 సంవత్స రాలుగా అనునిత్యం ఆర్. కృష్ణయ్య పోరాటం చేస్తున్నారని. జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిట్ల శ్రీధర్ మాట్లాడుతూ బీసీల కొరకు నిరంతరం పాటు పడుతున్న కృష్ణయ్య వడ్డెరల తరపున ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి వడ్డెర విద్యా ర్థులు ఉన్నత చదువులు, మంచి మంచి స్థానాల్లో స్థిరపడేలా చూడాలని కోరారు. వడ్డెర కులస్థుల్లో చాలా మంది వెనుకబడి ఉన్నారని, మెరిట్లు, తదితర వాటిల్లో వెనుకంజలో ఉన్నారని. ప్రోత్సహించాలని కోరారు. బాన్సువాడ ప్రాంతానికి చెందిన పిట్ల శ్రీధర్ కు జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించడం పట్ల ఆర్.కృష్ణయ్య ఆయనను అభినందించారు.వడ్డెరలు ఉద్యోగ, ఉపాధి పరంగా వెనుకబడి ఉన్నారని, తనవంతు శాయ శక్తులా కృషిచేస్తారని హామీ ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర అధ్యక్షులు వల్లపు శివకుమార్, రూపాని లోక నాథం, బోదాసు రవి, జరుపటి రాజు, రంగారెడ్డి, ముద్దంగుల ఆంజనేయులు, గోగుల రమేష్, తదితరులు ఉన్నారు.

More articles

Latest article