31.8 C
Hyderabad

ఎస్కేప్ గేట్ల ద్వారా నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్ల ద్వారా వరద నీరు గోదావరి నదిలోకి 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. కావున మత్స్యకారులు, సామాన్య ప్రజలు నది లోకి దిగకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు  ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా తగ్గడంతో  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి 9,790 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టిఎంసిలుగా ఉంది. కాకతీయ 5000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతుందని తెలియజేశారు.

More articles

Latest article