- భళా .. టెన్షన్ లేని పెన్షన్ పని
నాయకునికి బంగారు బాతులా అర్టిజన్
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ డివిజన్ కార్యాలయంలో పని చేసే అర్టిజన్ ఉద్యోగి తన యధాస్థానానికి వెళ్లేందుకు విముఖతను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సిఎండికి తెలియకుండా ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే నాయకుని ప్రోద్బలంతో 18 నెలలుగా డివిజన్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఇదే కార్యాలయంలో ఉన్న అటెండర్ బదిలైన డివిజన్లోనే పని చేస్తుందని ఆరోపణలు చేయనారంబించడంతో ఎవరి స్థానాలకు వారు వెళ్ళాలని అధికారి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇందులోనే పని చేస్తున్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ లను తమ స్థానాలైన సబ్ డివిజన్ లకు వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చిన అధికారి, నందిపేట్ ఆపరేటర్ విషయాన్ని మరిచిపోయారా ..ఎవరైనా చెబితే పక్కన పెట్టారా అనే సందేహాలు కాంపౌండ్ లో ఉన్న ఉద్యోగులలో మెధలాడుతున్నాయి.
- సెలవు భూటకం…
డివిజన్ కార్యాలయాన్ని వీడాలని అధికారి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో సెలవు భూటకాన్ని ప్రదర్శించారు. అటెండర్ ఇప్పటికీ సెలవులో ఉండగా, అర్టిజన్ మాత్రం డివిజన్ కార్యాలయానికి వారం రోజులు రాకుండా సెలవులో ఉన్నట్లు నమ్మించారు. నందిపేట్ లోని ఈఆర్ఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగి ఎక్కడ సెలవు పత్రం ఇచ్చిన దాఖలాలు లేవని, ఆ వారం పని చేయకున్నా జీతం కట్టించారని కొన్ని సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
- బంగారు బాతుల…
అర్టిజన్ ఉద్యోగి డివిజన్ లో పని చేస్తున్నాడు అనేకంటే నాయకునికి బంగారు బాతుల మారాడు అనే ప్రచారం జరుగుతోంది. ఉద్యోగులతో పాటు విరమణ పొందినవారు జీత, భత్యాల గురించే గాకుండా విధి నిర్వహణలో జారీ చేయబడిన మెమోలను తీసివేయించుకునేందుకు డివిజన్ కార్యాలయానికి వస్తుంటారు. ఇక్కడే అసలు కథ ఆరంభమవుతుంది…అలా వచ్చిన వారి దరఖాస్తులలో ఉన్న లోపాలను కంప్యూటర్ ముందున్న ఉద్యోగి గమనించి, తనను నమ్మి తీసుకొచ్చిన నాయకునికి చేరవేస్తాడు. పని తొందరగా పూర్తవ్వాలంటే సంఘ ప్రతినిధిని కలవమని ఉచిత సలహా ఇస్తుంటాడు. ఆ భాదితులు(సంఘం వేరైనా) సంఘ నాయకున్ని ప్రసన్నం చేసుకుంటే దస్త్రం ముందుకు కదులుతోంది. వీరితో పాటు పెన్సనర్ల భాధలు వర్ణనాతీతం..వీరికి వచ్చే బెనిఫిట్ నుంచి పర్సంటేజ్(రూ.లక్షలు) మాట్లాడుకొని పనులు చక్కదిద్దుతున్నారనే ఆరోపణలు పవర్ హౌస్ లో వినబడుతున్నాయి. లోపలి రహస్యాలను చేరవేసి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్న అర్టిజన్ ను నాయకుడు ఎలా వదులుకుంటాడు. నిత్యం బంగారు గుడ్డు పెట్టె బాతును ఎవరైనా వదులుకుంటారా ..?