28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

‘లెండి‘కి జుక్కల్ రైతులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ : మహారాష్ర్టంలో నిర్మాణంలో ఉన్న లెండి ప్రాజెక్టును సందర్శించేందుకు జుక్కల్  ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం తరలివెళ్లారు. ఉమ్మడి రాష్ర్టంలో ఆంధ్ర, మహారాష్ర్ట ప్రభుత్వాలు కలిసి మహారాష్ట్ర భూభాగంలో లెండి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాయి. 70శాతం మాత్రమే పనులు పూర్తికాగా, అసంపూర్తి పనుల కారణంగా లెండి ప్రాజెక్టు నుంచి నీరు జుక్కల్ నియోజకవర్గానికి అందడం లేదు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో లెండి ప్రాజెక్టు పనులు చేపడతామని పేర్కొంది. అందులో భాగంగా రైతులను వెంటబెట్టుకొని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. వారి వెంట సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.

 

More articles

Latest article