- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాకు జాయింట్ సర్వే నిర్వహించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రెవిన్యూ, మైనింగ్, భూగర్భ జల శాఖ, నీటిపారుదల శాఖల అధికారులతో జిల్లా స్థాయి సాండ్ (ఇసుక) కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు కావలసిన ఇసుక నిమిత్తం జాయింట్ సర్వే నిర్వహించాలని రెవిన్యూ, మైనింగ్, భూగర్భ జల శాఖ, నీటిపారుదల శాఖల అధికారులను ఆదేశించారు. మంజీరా నదిపై జరిగే అక్రమ ఇసుక రవాణా అరికట్టడం కోసం చెక్ పాయింట్ల ఏర్పాటు చేయాలని రెవిన్యూ, పోలీసు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా లను అరికట్టేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ పాయింట్ ల వద్ద సీసీ టివి లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఆర్డీఓ లు ప్రభాకర్, వీణ, మైనింగ్ సహాయ సంచాలకులు పి.నగేష్, ఇరిగేషన్, తదితరులు పాల్గొన్నారు.
