- తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి కి వినతి పత్రం అందజేత
- తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే నూతన నియమకాలు చేపట్టాలని విజ్ఞప్తి
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ప్రాంగణానికి విచ్చేసిన సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణ కాంట్రాక్ట్ అద్యాపకులు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో 1100 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారని విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నారనిఅన్నారు. ఒకవైపు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు విద్యానందిస్తూ అంతేకాకుండా అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిపాలన బాధ్యతలను సైతం నిర్వర్తిస్తున్నారని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ నాయకులు డా. నారాయణ గుప్తా, డా.యాలాద్రి, డాక్టర్ సునీత మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత నోటిఫికేషన్ కు వెళ్లాలన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ద్వారా రాష్ట్ర ముఖ్య మంత్రి, విద్యాశాఖ మాత్యులు రేవంత్ రెడ్డి కి విన్నపించాలని కోరారు. ఏళ్ళ తరబడి విశ్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న మమ్మల్ని రెగ్యులరైజ్ చేయ డానికి సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నట్లయితే, మొదటగా బేసిక్ +డీఏ + హచ్ఆర్ఏ, 3శాతం ఆన్యూవల్ ఇంక్రిమెంట్ తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ నెరవేరడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎలాంటి ఆర్థిక పరమైన భారం పడటం లేదని దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే వివిధ రాష్ట్రాలైనా కర్ణాటక ఒడిస్సా, పంజాబ్, మణిపూర్ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేశాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని తొందరలో సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమం లో డాక్టర్ నరసయ్య, డాక్టర్ రమాదేవి, శ్రీకాంత్, డాక్టర్ నిరంజన్, దిలీప్, డాక్టర్ సరిత, తదితరులు పాల్గొన్నారు.
