29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జీవో 29 రద్దు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నిాజామాబాద్, బతుకమ్మ : జీవో 29 రద్దు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ జీవో 29 రద్దు చేయాలని, ఈ డబ్ల్యూ ఎస్ అవసరం లేదని, 42 రిజర్వేషన్ కల్పించాలని, సమగ్ర కులగణన వెంటనే పూర్తి చేయాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు బీసీలను ఐక్యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులకు పదవుల నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ పోతనకర్ లక్ష్మీనారాయణ, గౌరవాధ్యక్షులు బొబ్బిలి నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనుగందుల మురళి, ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రేవంత్, జిల్లా అధికార ప్రతినిధి అమంద్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article