30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నేత్రపర్వంగా జెండా బాలాజీ జాతర

Must read

📰 Generate e-Paper Clip

పెద్ద ఎత్తున హాజరైన భక్త జనం

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెలసిన జండా గుడి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే జండా జాతర మహోత్సవం బుధవారం నేత్రపర్వంగాకొనసాగింది. ఆలయం నుండి ప్రారంభమైన జెండాఊరేగింపు సిర్నపల్లి గడికి తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పూలాంగ్ వరకు ఊరేగింపు కొనసాగింది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణమి రోజున ఈ జెండా బాలాజీ జాతర నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. పక్షం రోజుల తర్వాత గుడి నుండి జెండాను ఊరేగింపుగా తీసుకెళ్లి నగరంలోని పూలాంగ్ సమీపంలోజెండాను ప్రతిష్టించడం జరుగుతుందని, ఆ తర్వాత ఆ జెండాను తిరుపతి వరకు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. బుధవారం జరిగిన జండా బాలాజీఊరేగింపు మహోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ,, తోపాటు ఎంతో మహిమ కలిగిన ఈ జెండాను సంవత్సరంకి ఒకసారైనా దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే పెద్ద ఎత్తున ఈ జెండా జాతర చివరి రోజు జెండా ఊరేగింపు కార్యక్రమంలో పులాంగ్ వరకు భక్తులు పాల్గొంటారు.

More articles

Latest article