నేత్రపర్వంగా జెండా బాలాజీ జాతర

పెద్ద ఎత్తున హాజరైన భక్త జనం బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెలసిన జండా గుడి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే జండా జాతర మహోత్సవం బుధవారం నేత్రపర్వంగాకొనసాగింది. ఆలయం నుండి ప్రారంభమైన జెండాఊరేగింపు సిర్నపల్లి గడికి తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పూలాంగ్ వరకు ఊరేగింపు కొనసాగింది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణమి రోజున ఈ జెండా బాలాజీ జాతర నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. పక్షం రోజుల తర్వాత గుడి నుండి జెండాను ఊరేగింపుగా తీసుకెళ్లి...