వెబ్ న్యూస్, బతుకమ్మ : మోకిలా పోలీసుల ఎదుట విచారణకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరోసారి హాజరయ్యారు. 140 ఎకరాల భూమి వివాదంలో మళ్లీ జీవన్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు.. ఫ్లాట్ ఓనర్స్ ను బెదిరించి అక్రమంగా భూమి లాక్కున్నారని జీవన్ రెడ్డిపై చేవేళ్ల, మోకిలా పీఎస్ ల్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. భూ యజమానులను ల్యాండ్ లోకి రాకుండా అడ్డుకున్న జీవన్ రెడ్డి అనుచరులు, భూ యజమాని దామోదర్ రెడ్డిని మోసం చేసి ల్యాండ్ లాక్కున్నారని ఆరోపణలున్నాయి. జీవన్ రెడ్డి దగ్గర ఉన్న డాక్యుమెంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.