26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు సకాలంలో హాజరు కావాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  ఉమ్మడి జిల్లాలో 28 కేంద్రాల ఏర్పాటు
  •  ఆలస్యం అయితే అనుమతించబోం
  • నవోదయ వైస్ ప్రిన్సిపాల్ మనుజే యోహానన్

 

నిజాంసాగర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయ లో ప్రవేశలకు  శనివారం 11:30 నుండి 1:30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామని నవోదయ వైస్  ప్రిన్సిపాల్ మనుజే యోహానన్  రు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో సమయానికంటే ముందే వచ్చి వారి వారి స్థానాల్లో  ఉండాలని ఆలస్యమైతే లోనికి అనుమతించబోమని అన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 28 ప్రవేశ  పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, వంటివి తీసుకొని రావద్దని, బ్లూ అండ్ బ్లాక్  పెన్నులు, హాల్ టికెట్  మాత్రమే వెంటబెట్టుకొని రావాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో 2,902 మంది విద్యార్థులు, కామారెడ్డి జిల్లాలో 3,138 విద్యార్థులు, మొత్తం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల విద్యార్థులు 6040 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.

More articles

Latest article