29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్‌ను నియమించారు. ఈ సందర్భంగా జస్పాల్ సింగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని జస్పాల్ సింగ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ గ్రామ గ్రామాన బీజేపీని మరింత బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధి, మైనార్టీ వర్గాలకు చేరువ కావడం, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

More articles

Latest article