- కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
న్యూ ఢిల్లీ, బతుకమ్మ : భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిటీ కూడా పూర్తీ స్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వంకు అందజేసిందన్నారు. జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్(ఆర్టికల్ 83,85,172,174,356) లు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చెయ్యాలని సూచించిందని పేర్కొన్నారు. ఈ బిల్లు ఆక్సెప్ట్ అవ్వాలి అంటే లోక్ సభ, రాజ్య సభ లో 67% మంది సపోర్ట్ చెయ్యాలని తెలిపారు. 14 రాష్ట్రాలు అసెంబ్లీలు సపోర్ట్ చెయ్యాలని పేర్కొన్నారు. అలా మద్దతు ఇస్తే బిల్లు రాజ్యాంగ పరిధిలోకి వస్తుందన్నారు. ఈ బిల్లు 2024 ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెoటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుందని పేర్కొన్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు లభిస్తే 2027 ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. ఈ ఎన్నికలు జరిగిన 100 రోజుల తర్వాత మున్సిపల్,గ్రామ పంచాయితి ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. దేశం మొత్తం పరిపాలన సౌలభ్యం కొరకు ఈ జమిలి ఎన్నికలు జరపనున్నట్లు తెలిపారు.
