24.1 C
Hyderabad
Monday, August 3, 2026

సర్కార్ బడికే జై… ప్రైవేట్ కు నై

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సర్కారు స్కూల్స్ కు క్యూ కట్టిన ప్రైవేట్ విద్యార్ధులు

 

. . . ఈ విద్యా సంవత్సరం లో 58,166 మంది విద్యార్ధుల చేరిక

 

. . . గవర్నమెంట్ పాఠశాలల్లో అడ్మిషన్ లలో నిజామాబాద్ ఫస్ట్

 

. . . ములుగు జిల్లా కు చివరి స్థానం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ లలో చేరడం ట్రేండింగ్ గామారింది. సర్కారు పాఠశాలల్లో అడ్మిషన్ లు ఫుల్ అనే బోర్డులు దర్శనం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్ల బలోపేతంకు తీసుకుంటున్న చర్యలకు తోడు.. మంచి ఫలితాలు… అర్హులైన ఉపాధ్యాయుల బోధన జరుగడం కారణం అని చెప్పాలి. అదే సమయంలో ప్రైవేట్ లలో ఫీజుల మోత విద్యార్ధుల తల్లిదండ్రుల మేడకు గుదిబండగా మారాయి. ఇంటిలో పాఠశాలకు వేళ్లి చదివే విద్యార్ధులు ఉన్న ఇండ్లలో ముఖ్యంగా పేదవారిలో ఫీజులు చెల్లించలేక, మోహమాటానికి, సమాజంలో పేరుతో ప్రైవేట్ కు పంపితే విద్యార్ధుల చదువులు మధ్యలో ఆపాల్సిన పరిస్థితి నెలకొంది. దానితో పాటు గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోదన జరుగుతుండటంతో ప్రైవేట్ లో ఫీజులు కట్టి చదివించాల్సిన అవసరం లేదని చాలామంది విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ నుంచి తీసివేసి సర్కార్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. మొన్నటి వరకు విద్యార్ధులకు ఉచిత విద్యా, ఉచితంగా పుస్తాకాలతో పాటు మద్యాహ్న భోజనం అందిస్తుండగా ఇటీవల ప్రభుత్వం అల్పాహారం పంపిణీకి చర్యలు తీసుకున్నది. దానితో సర్కారు బడులలో చేరే విద్యార్ధుల గణనీయంగా పెరిగింది.

 

Jai to government schools... No to private schools

 

2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ లు పెరిగాయి. కొత్త విద్య సంవత్సరం ప్రారంభంలోనే విద్యా శాఖ బడిబాట కార్యక్రమం చేపట్టింది. అంతే గాకుండా ఈ విద్యాసంవత్సరం సర్కార్ స్కూల్స్ లో ప్రీ ప్రైమరీని (గవర్నమెంట్ ప్లే స్కూల్స్) లను ప్రారంభించడంతో అడ్మిషన్ లు పెరిగాయి. అంగన్ వాడిలలో ఉన్న చిన్నారులను డైరెక్ట్ గా ప్రైవేట్ కు పంపకుండా సర్కార్ బడులలో చేర్పించడంలో వీటి పాత్ర ఎంతైనా ఉంది. అంతే గాకుండా సర్కార్ సైతం యంగ్ ఇండియా స్కూళ్లను నియోజకవర్గంకు ఒక్కటి ఏర్పాటు చేస్తుండటంతో కలిసి వచ్చింది. దానికి తోడు గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్రిపుల్ ఐటితో పాటు పాలిసెట్ లలో అడ్మిషన్ లు దొరుకుతుండటం కుడా ఒక కారణం. ప్రైవేట్ స్కూళ్ల లో వస్తున్న ఫలితాల కంటే మెరుగైన రిజల్ట్ చెంతనే వస్తుండటంతో తల్లిదండ్రులు కూడా సర్కార్ స్కూళ్లకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో పలు స్కూళ్లలో వెయ్యి మందికి పైగా విద్యార్ధులతో ఒక్కో తరగతిని నాలుగు సెక్షన్ లుగా ఏర్పాటు చేసి అడ్మిషన్ లు చేసుకుంటున్నాయి. ఆయా పాఠశాలల్లో ఫలితాలు మెరుగ్గా వస్తుండటంతో సర్కార్ స్కూల్స్ కు అడ్మిషన్ లకు పైరవీలు చేయాల్సిన పరిస్థితి నెలకోంది.

 

Jai to government schools... No to private schools

 

సర్కార్ బడులల్లో ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చి చేరుతున్న విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో 33 జిల్లాలలో 58,166 మంది విద్యార్ధులు ప్రైవేట్ నుంచి వచ్చి చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి ప్రైవేట్ కు వెళ్లిన వారి సంఖ్య 2656 ఉండటం విశేషం. ప్రభుత్వ స్కూల్స్ లో ముఖ్యంగా జిల్లా పరిషత్, మండల పరిషత్, గవర్నమెంట్ ప్రైమరి, అప్పర్ ప్రైమరి, హైస్కూల్స్ కు గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలో నిజామాబాద్ జిల్లా 5111 మంది విద్యార్ధులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. ములుగు జిల్లా 270 అడ్మిషన్ లతో చివరి స్థానంలో ఉంది. జగిత్యాల 4204, కామారెడి 4031 మంది విద్యార్ధులతో వరుసగా ద్వితియ, తృతీయ స్థానాలలో నిలిచాయి. నిజామాబాద్ జిల్లాలో సర్కార్ బడుల నుంచి 167, జగిత్యాల జిల్లాలో 140, కామారెడ్డి జిల్లాలో 229 మంది విద్యార్ధులు మాత్రమే ప్రైవేట్ స్కూళ్లలో చేరడం గమనార్హం.. ప్రైవేట్ నుంచి సర్కార్ స్కూళ్లకు విద్యార్ధులు చేరుతుండటం కొత్త శకంగా చెప్పాలి. విద్యార్ధుల తల్లిదండ్రులకు సైతం గవ్నమెంట్ విద్యా బోధనపై నమ్మకం పెరుగడం కూడా కారణం అని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలతోనే అడ్మిషన్ లు పెరుగుతున్నాయని విద్యావేతలు చెబుతున్నారు.

 

Jai to government schools... No to private schools

More articles

Latest article