24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ మాట్లాడడం విడ్డూరం

Must read

📰 Generate e-Paper Clip

. నీవు ఓల్డ్ సిటీకే ముఖ్యమంత్రివా..?

. ఓర్వలేకే కిషన్ రెడ్డిపై ఆరోపణలు

. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శలు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ బీజేపీ గురించి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రంజాన్ ఉందని పదో తరగతి పరీక్షల సమయాన్ని మార్చడం తగదని, నీరు తెలంగాణకు ముఖ్యమంత్రివా..? లేక ఓల్డ్ సిటీకా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు కానీ డైవర్స్ పాలిటిక్స్ చేయడంలో మాస్టర్స్ పూర్తి చేసారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేసే చేతకాక ప్రభుత్వం ఏర్పడిననాటి నుండి డైవర్స్ పాలిటిక్స్ చేయడం అలవాటైపోయిందన్నారు. ఎస్ఎల్ బీసీ ఘటన, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, ప్రజల తిరుగుబాటు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, బిజెపి ఎదుగుదల ఓర్వలేక కిషన్ రెడ్డి మీద విషయం చిమ్ముతున్నారని ఆరోపించారు. రంజాన్ కోసం పరీక్షల టైమింగ్స్ మారిన రేవంత్ ను ప్రజలు మార్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article